అయ్యా! తమరి దర్శనార్ధం ఒక వ్యక్తి వచ్చి వున్నాడు. లోపలకు పంపమంటారా? ఆరడుగుల ఆజానుబాహుడు వంగి వంగి మరీ వినయంగా చెప్పాడు రెవెన్యూమంత్రి రంగారావు గారితో. చెక్క ఊయలమీద కూర్చుని వున్న రంగారావు రెండునిమిషాలు ఆలోచించి వచ్చిందెవరు?