ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి మేనల్లుడు వరుడు (అల్లు అర్జున్)కి నేడు (ఏప్రిల్ 8) పుట్టినరోజు. తెలుగు సినీరంగంలో యూత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టిపడేసే అల్లు అర్జున్.. గంగోత్రి చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ వేదం, బద్రీనాథ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. బన్ని పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ పర్సనల్ టచ్ మీకోసం.. అసలు పేరు: అల్లు అర్జున్ పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1983, జన్మస్థలం: చెన్నై,తొలి సినిమా: ఆర్య,అవార్డులు: సంతోషం రెండు, నంది ఒకటి.