ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మార్చి 2026 (19:32 IST)

Titanic pose: జాక్, రోజ్‌లా టైటానిక్ ఫోజు ఇచ్చిన ట్రంప్ ఎఫ్‌స్టీన్.. Epstein Files సంగతి ఏంటి? (video)

Donald Trump and Jeffrey Epstein
Donald Trump and Jeffrey Epstein
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ విగ్రహం చర్చనీయాంశంగా మారింది. టైటానిక్‌ ఫోజులో వీరిద్దరూ నిలబడటం ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్, జెఫ్రీ ఎప్‌స్టీన్, డొనాల్డ్ ట్రంప్ చుట్టూ వున్న వివాదం కొత్తదేమీ కాదు. 
 
కాలక్రమేణా లైంగిక అక్రమ రవాణా బాధితులతో ప్రారంభమైన ఫైల్ ప్రపంచంలోని ప్రముఖుల పేర్లతో కఠినమైన సత్యాలను బయటపెట్టింది. ఇటీవలి వార్తలలో, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దివంగత ఫైనాన్షియర్ లేదా అపఖ్యాతి పాలైన లైంగిక అక్రమ రవాణాదారు జెఫ్రీ ఎప్‌స్టీన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఈ విగ్రహాన్ని అనామకులు రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్‌లో ఈ విగ్రహం కనిపించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ విగ్రహం కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విగ్రహానికి ది కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు పెట్టింది అమెరికా మీడియా. ఈ విగ్రహాల కింద వున్న ఫలకాలపై రాసిన వాక్యాలు ప్రస్తుతం మరింత చర్చకు దారితీస్తున్నాయి. 
 
టైటానిక్ మూవీలో జాక్, రోజ్ మధ్య విషాద ప్రేమకథ విలాసవంతమైన ప్రయాణాలు, పార్టీలు, రహస్య నగ్న చిత్రాల మీద ఆధారపడి వుంటే.. ఈ విగ్రహం ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య వున్న అలాంటి బంధాన్నే గుర్తు చేస్తోంది.. అని రాసి వుంది. 
 
కేవలం ఈ విగ్రహమే కాకుండా, క్యాపిటల్ హిల్ మార్గంలో పది బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటిపై ట్రంప్, ఎఫ్‌స్టీన్ కలిసి వున్న ఫోటోలతో పాటు మేక్ అమెరికా సేఫ్ ఎగైన్ అనే నినాదం రాసి వుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.