సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
Wife Tears divorce papers in court
ఈ విషయం తెలుసుకున్న శిఖా భర్త సౌరభ్, తన మామగారిని మెరుగైన వైద్యం కోసం ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అన్ని ఖర్చులు భరించాడు. మరుసటి రోజు కోర్టులో విచారణ సందర్భంగా, సౌరభ్ చూపిన మానవత్వాన్ని చూసి శిఖా మనసు మారింది. ఆమె విడాకుల పత్రాలను చించివేసి, కన్నీళ్లు పెట్టుకుంటూ భర్తను హత్తుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కేసు వివరాల్లోకి వెళితే.. శిఖా సింగ్‌కు 2020లో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసు పోరాటంలో శిఖ తండ్రి తన డబ్బునంతా ఖర్చు చేశారు. చివరికి ఆయన ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే, కనీసం చికిత్స పొందే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఆయనకు గుండెపోటు రావడంతో, విషమ పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన శిఖ భర్త సౌరభ్, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, తన మామగారిని అక్కడి నుండి గురుగ్రామ్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన మేదాంతకు తరలించి చికిత్స ఇప్పించారు.ప్రస్తుతం శిఖ తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు.
ఢిల్లీ కోర్టులో తదుపరి విచారణకు హాజరయ్యేందుకు శిఖ అక్కడికి వెళ్లారు. కోర్టుకు చేరుకోగానే, ఆమె విడాకుల పత్రాలన్నింటినీ చింపివేసి, తన భర్తను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
A man accused of dowry by his wife forgot everything when he saw her family in distress.
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 11, 2026
An act of kindness brought a couple together. Imagine if the guy came forward to spend on his litigating father-in-law was he really a dowry seeker ?
But All well that ends well ❤️ https://t.co/scwzV30Xzg
