ఛానల్స్‌పై దాడి కంటే ఇదే బెటర్‌!

Venkateswara Rao. I| Last Modified సోమవారం, 8 అక్టోబరు 2012 (16:51 IST)
బుల్లితెర మాద్యమంపై దాడి జరగబోతుంది. బుల్లితెరను నమ్ముకుని ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు బతుకుతున్నారు. కానీ వారికి పని కల్పించకుండా ప్రముఖ ఛానల్స్‌ కొన్ని పరభాషా సీరియల్స్‌ను నేరుగా డబ్బింగ్‌ చేసి మహిళలపై రుద్దుతున్నాయి. ఆ సీరియల్స్‌ టేకింగ్‌, ఖర్చులు ఏకపక్షంగా ఉండటంతో వాటిని రుద్దడంతో... తెలుగు సీరియల్స్‌ రేటింగ్‌ పడిపోతుంది. దానికితోడు ఇక్కడి నటీనటులకు పని దొరకడంలేదు.

షూటింగ్‌లు జరిగే తెలుగు సీరియల్స్‌ కూడా తక్కువగా ఉండటంతో ఏంచేయాలో అర్థంగాక.. టీవీ చానల్స్‌పై పోరాటానికి కంకణం కట్టుకున్నారు బుల్లితెర నటీనటులు .దీనికి తమ్మారెడ్డి భరద్వాజ ఛాంబర్‌ అధ్యక్షుడుగా కలిసి పోరాడతానన్నారట. మీరంతా కలిసికట్టుగా ఉంటే చాలు... టీవీ ఛానల్స్‌ దురాగతాన్ని అడ్డుకట్టవేయవచ్చని చెప్పారు. ఆదివారం జరిగిన టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1. ముందుగా చానల్స్‌ ప్రతినిధులతో కలిసి మాట్లాడటం.
2. టీవీల్లో వచ్చే రకరకాల ప్రోగ్రామ్స్‌లో నటీనటులు పాల్గొనకుండా చేయడం.
3. అప్పటికీ వినకపోతే.. చానల్స్‌పై దాడి చేయడానికైనా సిద్ధమే.
ఇవి కరెక్ట్‌గా అమలు చేస్తే చాలు టీవీ పరిశ్రమ కళకళలాడుతుందని అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు.


దీనిపై మరింత చదవండి :