కలర్స్ బిగ్ బాస్ షోకు ముంబై హైకోర్టు స్టే విధించింది. కలర్స్ టెలివిజన్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించి 24 గంటలు పూర్తి కాకముందే ఆ కార్యక్రమ నిర్వహకులు ముంబై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కాగా.. రియాల్టీ షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.