"బిగ్ బాస్ 4"కు వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్

Hanumantha Reddy|
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు "బిగ్ బాస్ 4" కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కలర్స్ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 4. ఇదివరకు ఈ బిగ్ బాస్ సీజన్ 3కు వ్యాఖ్యాతలుగా షిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్‌లు వ్యవహరించారు. అంతేకాకుండా గతంలో ప్రముఖ సోనీ టీవీ నిర్వహించిన "దస్ కా దమ్" ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఆ కంట్రాక్టు ముగియడంతో ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా... ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న "కౌన్ బనేగా కరోడ్‌పతి"కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే "కౌన్ బనేగా కరోడ్‌పతి 4"(సీజన్ 4) ప్రోగ్రామ్‌కి సంబంధించి రిజిష్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ఛానళ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే మరి.


దీనిపై మరింత చదవండి :