టెలివిజన్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇది వరకు సోనీ టెలివిజన్ ఛానెల్ బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహించి టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా కరోడ్‌పతి అనే రియాల్టీ షో తిరిగి ప్రారంభం కానుంది. ఈ సీజన్-4 ప్రోగ్రామ్‌కు కూడా బిగ్ బినే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.