స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో ఆర్భాటంగా సి. అశ్వనీదత్ ప్రారంభించిన లోకల్‌టీవీ ఛానల్ తాజాగా మీడియా అవార్డులను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే రెగ్యులర్ అవార్డులనేవి సినిమాలకు సంబంధించి ఉంటాయని తేల్చి చెప్పింది. అయితే మీడియా అవార్డులు ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్న మీడియా నుంచే వచ్చింది. అవార్డుల్లో జనరంజక న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్, జనరంజ టీవీ న్యూస్ రీడర్, న్యూస్ ప్రెజెంటేటర్స్, టీవీ దర్శకుడు, రియాల్టీ షో, యాంకర్ ఇలా అన్ని కలిపి 29 అవార్డులను లోకల్ టీవ్ ఛానల్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించింది.