వెండితెర రారాజుగా ఎంపికైన హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్!

SELVI.M|
హాలీవుడ్ కథానాయకుడు బ్రాడ్ పిట్ రారాజుగా ఎంపికయ్యాడు. షోబిజ్‌లో అత్యంత ఆరాధుడిగా ఎంపికైన బ్రాడ్ పిట్ అత్యధిక ఓట్లు సాధించాడు. "మార్కెట్ రీసెర్చ్ సంస్థ వన్‌పోల్ డాట్ కామ్" నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రాడ్‌ పిట్ అగ్రస్థానంలో నిలిచాడు.

అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో సాకర్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో నటుడు బ్రూస్ విల్లీస్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో బ్రాడ్ పిట్‌కే అత్యధిక ఓట్లు లభించాయని, అతనే వెండితెర రారాజుగా ఎంపికైనట్లు వన్‌పోల్ డాట్ కామ్ ఓ ప్రకటనలో తెలిపింది.


దీనిపై మరింత చదవండి :