తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి.. అంటారు. ఇదే బ్యానర్‌గా పెట్టి సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి చిత్రాల నిర్మాత దొరస్వామిరాజు మహాభారతం అనే మెగా సీరియల్‌ను నిర్మిస్తున్నారు. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నన్నయ, పోతన, తిరుపతి వేంకట కవుల పద్యాలు నేటికీ తెలుగు వాకిట వినిపిస్తూనే ఉంటాయి. చెల్లియో చెల్లకో అంటూ పాడకుండా ఉండేవారే ఉండరు. తెలుగుజాతి జీవితంలో మమేకమైన భారతాన్ని పిన్నలు, పెద్దలు, యువకులు చూసి ఆనందించేటట్లుగా వి.ఎం.సి సంస్థ నిర్మిస్తోంది. కృష్ణుడిగా సాయికిరణ్, ద్రౌపదిగా సన నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో స్టేజి నటులు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారు.