హొయలుపోయే ఉదయభాను ముందు తేలిపోయిన రాజా

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified మంగళవారం, 2 ఆగస్టు 2011 (12:11 IST)
WD

పెద్ద తెరపై రాణిస్తున్న హీరోయిన్ల మాదిరిగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉదయభాను తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమె యాంకరింగ్ కొన్నిసార్లు కాస్తంత ఓవర్‌గా అనిపించినా... ఇపుడా ఓవర్నే బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని బుల్లితెర విశ్లేషకుల మాట.

అన్నట్లు ఇపుడు ఉదయభాను విషయం ఎందుకొచ్చిందయా.. అంటే, గేమ్ షోల్లో టాప్ యాంకర్‌గా పేరున్న భానుతో కలిసి యాంకరింగ్ చేయడానికి చిన్నహీరోలు పోటీపడుతున్నారు. పొట్టి కామెడీ హీరో వేణుమాధవ్ చాన్నాళ్లుగా ఉదయభానుతో కలిసి సినీ ఫంక్షన్లలో నవ్వించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

ఇపుడు అదే బాటలో ఆనంద్ ఫేమ్ రాజా పయనిస్తున్నాడు. "థమ్స్ అప్ థండర్ స్టార్" అడ్వెంచరస్ గేమ్ షోకి ఉదభానుతోపాటు రాజా యాంకరింగ్ చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే... ఉదయభాను హొయలుగొలిపే యాంకరింగ్ ముందు రాజా తేలిపోతున్నాడు. ఏదో బిగ్ స్క్రీన్‌పైనే ఫ్లాప్ అయ్యాడనుకుంటే స్మాల్ స్క్రీన్ మీదా వెలవెలబోతున్నాడన్నమాట. ఏం చేస్తాం.. ఒక్కసారి కనుక ఫ్లాప్ ఆవహిస్తే అది ఓ పట్టాన వదలదు మరి. దాని నుంచి బయటపడాలంటే చాలానే కసరత్తు చేయాలి. గ్లామర్ ప్రపంచం అంతే...!!


దీనిపై మరింత చదవండి :