3 నుంచి గోద్రెజ్ డ్రీమ్ హోం ఆడండి లైఫ్ మార్చుకోండి!!

PNR|
WD
WD
ప్రముఖ గృహోపకరాణాల వస్తు ఉత్పత్తి సంస్థ గోద్రెజ్ కంపెనీ.. సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ఒక వినూత్న రియాలిటీ షోను నిర్వహించనుంది. గోద్రెజ్ డ్రీమ్ హోం ఆడండి లైఫ్ మార్చుకోండి అనే పేరుతో ఈ షోను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనదలచిన వారు గోద్రెజ్ వస్తువులను కొనుగోలు చేసి తమ పేర్లను ఎస్ఎంఎస్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఈ వినియోగదారులు మాత్రమే ఎస్ఎంఎస్, ఐవీఆర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన కష్టమర్లు ఎస్ఎంఎస్‌ కాకుండా, గోద్రెజ్ మేక్స్ మై లైఫ్ బ్రైటర్ అనే నినాదంతో పది పదాలు రాసి నమోదు చేసుకోవచ్చు.

ఈ రియాలిటీ షోను కేవలం దక్షిణ భారత దేశంలోనే సన్ నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేయనున్నారు. తమిళంలో గోద్రెజ్ విళావై మాట్రలాం వాంగా అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 11-12 గంటల మధ్య సన్ టీవీలో ప్రసారం కానుంది. అలాగే, తెలుగులో గోద్రెజ్ డ్రీమ్ హోమ్, ఆడండి లైఫ్ మార్చుకోండి అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య జెమినీ టీవీలో ప్రసారం చేస్తారు. అలాగే కన్నడలో గోద్రెజ్ గేమ్ ఆడి.. లైఫ్ ఛేంజ్ మాడి అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య ఉదయ టీవీలో ప్రసారం చేయనున్నారు.

గతంలో ఈ సంస్థ తొలి సెషన్‌లో దీన్ని హిందీలో ప్రసారం చేయగా వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో రెండో సెషన్‌ను సన్ టీవీ, బాంగ్‌ సినెర్జీతో కలిసి గోద్రెజ్ సంస్థ దక్షిణ భారతీయ భాషల్లో మాత్రమే టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై గోద్రెజ్ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అషుతోష్ తివారీ, బిగ్ సినెర్జీ డైరక్టర్ అనితా కౌల్ బసు, సన్ నెట్‌వర్క్ గ్రూప్ ప్రోగ్రామింగ్ హెడ్ రవినాథ్ మేనన్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు.


దీనిపై మరింత చదవండి :