టర్కీలో కత్రినా.. ఉత్తరాదిలో సల్మాన్... కలుసుకునేదెట్టా!!?

IFM
ప్రేమికులు వాలెంటైన్ డే రోజున ప్రత్యేకంగా కలుసుకుని ఊసులాడుకోవాలని అనుకోవడం సహజమే కదా. అందునా తాజ్‌లాంటి పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు ప్రేమికులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాయి. కానీ "తిక్కెస్ట్ లవ్ కపుల్" సల్మాన్, కత్రినాలు మాత్రం రాబోయే ప్రేమికుల రోజు నాడు ఒకరికొకరు చాలా చాలా దూరంగా గడపబోతున్నారట.

ప్రేమికుల రోజునాడు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉండిరావల్సిరావడంపై కత్రినా, సల్మాన్‌లు చాలా బాధపడిపోతున్నారట. సల్మాన్ అయితే ఇప్పటికే కత్రినా బెంగతో నిద్ర పట్టక పీక్కుపోయిన కళ్లతో షూటింగ్‌లకు వస్తున్నాడట.

టర్కీలో రాజ్‌కుమార్ సంతోషి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న కత్రినా పరిస్థితీ ఇలాగే ఉందట. ఆమె సెల్ ఫోనుకు తీరికే దొరకటం లేదట. ఫోనులో ఆమె ఎవరితో మాట్లాడుతుందో మనకు వేరెవరూ చెప్పనక్కరలేదు కదా.

కత్రినా విదేశంలో షూటింగ్‌లో పాల్గొంటుండగా సల్మాన్ ఉత్తరభారతంలో వీర్ అనే చిత్రం షూటింగ్ పాల్గొంటున్నాడట. రాత్రి వేళంతా అతని గదిలో లైట్లు వెలుగుతూనే ఉంటున్నాయట. ఇదంతా చూస్తున్న యూనిట్ సభ్యులు... కత్రినాపై ఉన్న పిచ్చి ప్రేమ కొద్దీ సల్మాన్ రాత్రికి రాత్రే టర్కీ ఫ్లైట్ ఎక్కినా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారట.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఇదిలా ఉంటే కొందరు కత్రినా- సల్మాన్‌కు "టీ" కొట్టిందని గుసగుసలాడుతున్నారట. ఇది ఆ చెవినా... ఈ చెవినా పడి చివరికి కత్రినా చెవినే పడిందట. దాంతో తోకతొక్కిన పాములా పైకి లేచిందట కత్రినా. ఇటువంటి మాటలు వచ్చే కొద్దీ తమ ప్రేమ బంధం ఫెవీకాల్‌లా మరింత బలంగా అతుక్కుపోతుందనీ చెప్పిందట. సల్మాన్ సైతం ఇదే మాటను నొక్కి వక్కాణిస్తున్నాడట.


దీనిపై మరింత చదవండి :