ప్రేమంటే ఇదేనా....?

FILE
ప్రేమ సామ్రాజ్యం, అది ఒక కలల సామ్రాజ్యం. ఈ ప్రపంచంలో తపనకూడా ఉంటుంది. ఇందులో సుఖంవుంది, సంతోషంవుంది, బాధకూడా ఉంది. ప్రేమను వ్యక్తపరచలేము, గుండెల్లో ఏముందో అది మన కళ్ళల్లోనే కనపడుతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. నిజమే మరి, ప్రేమ రుచి చూసినవారు వారి అనుభవం కొద్ది చెప్పారు.

నేటి యుగంలో చూస్తుంటే అబ్బాయిలు/అమ్మాయిల మధ్య ప్రేమ తొందర్లో పుట్టుకువస్తుంది. నిజం చెప్పాలంటే ఇది ప్రేమకాదు. అది వారి శారీరక ఆకర్షణ మాత్రమే. పెళ్ళి చేసుకున్న తర్వాత వారికి ఈ విషయం తెలుస్తుంది. నేటి యువకులు అందంగా కనపడే అమ్మాయిలు కనపడితే వారిపై ప్రేమ వెంటనే పుట్టుకువస్తుందని, తొలి పరిచయంలోనే తమ మనసులోని మాట..అదే ప్రేమ పదాన్ని వల్లెవేస్తూ వారిని విసిగించి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారని పరిశోధకులు అంటున్నారు.

అమ్మాయిలలో వారి అందాన్ని చూసి ఆకర్షితులై అబ్బాయిలు ప్రేమ పాఠాలను ప్రారంభిస్తారు. అలాగే అమ్మయిలుకూడా మంచి స్టైల్‌గానున్న అబ్బాయిలు, కండలు తిరిగిన అబ్బాయిలంటే మరీ పడిఛస్తుంటారు. అలాగే గొప్పింటి అబ్బాయిలంటే మరీ ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇది కాదు నిజమైన ప్రేమంటే. ఇదే నిజమైన ప్రేమైతే చాలా వరకు ప్రేమ వివాహాలు బంధాలను తెంచుకుని తెగిన గాలిపటాలలా మారిపోతున్నది నేటి యువత. ఎందుకిలా?

మనం తరచూ చూస్తున్న కొన్ని సంఘటనలు వీటికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిల పట్లనున్న ఆకర్షణే ప్రేమగా మారి చివరికి పెండ్లి అనే పరిస్థితికి చేరుకుంటోంది. ఆ తర్వాత జీవితంలో పలు సందర్భాలలో పలు సమస్యలతో సతమతమైనప్పుడు వారి ప్రేమ మటుమాయమై అది విడాకులకు దారి తీయడమో, లేక సంసారాన్ని నరక ప్రాయం చేసుకోవడమో జరుగుతోంది. మరి ప్రేమంటే ఇదేనా !

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నిజమైన ప్రేమకోసం పరుగులు తీస్తున్నారు. కాని మనం అర్థం చేసుకునేదాంట్లోనే ప్రేమ దాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Gulzar Ghouse|
ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమకు, ఆకర్షణకు ప్రత్యేకమైన హార్మోన్లు వేరువేరుగావుంటాయి. ఆకర్షణకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ప్రేమకు తొలి చూపే ఆధారం. ఆ తర్వాత అది స్థిరంగా మారి నిజమైన ప్రేమకు దారి తీస్తుంది. నిజమైన ప్రేమ కాస్త సమయాన్ని తీసకుంటుంది. ఇరువురిలో ఒకరిపై మరొకరికి నమ్మకం, విశ్వాసం, పరస్పరమైన అవగాహన ఏర్పడతాయి. మన్ససులో ఉద్భివించిన ప్రేమ ఇంద్రధనస్సులా ఇరువురి మనస్సులు కలిసివుంటాయి.


దీనిపై మరింత చదవండి :