ప్రేమ ఆట వస్తువు కాదు

FILE
ప్రేమికులు ప్రారంభంలో ఒకరినొకరు కలిసి జీవించడానికి, అలాగే కలిసి చావడానికైనా సిద్ధమని శపథం చేసుకుంటుంటారు. ఇల్లు, కుటుంబం, చివరికి తమ ధర్మాన్ని మార్చుకోవాడానికికూడా సిద్ధపడుతుంటారు. కాని పెళ్ళైన తర్వాత క్షణికానందం తీరిపోతుంది. అంతలోనే వారు వేసుకున్న శపథాలు, ఇదివరకటి వారి బాసలు, ఊసులు మటుమాయమౌతాయి.

కాని వివాహమనేది ఓ పవిత్రమైన కార్యం. అంతకంటే మహా పవిత్రమైనది ప్రేమ అనే రెండు అక్షరాలు. ప్రేమ అనే పేరుతో కొందరు దోబూచులాడుకుంటుంటారు. ప్రేమ అనేది కొందరికి ఒక ఆట వస్తువుగా మారింది. బజార్లో కొనే వస్తువులాగా కొందరు డబ్బుతో ప్రేమను కొనడానికికూడా వెనుకాడరు. ఇలా ఎందుకు మారుతోంది ఈ సమాజం. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడం ఎంత వరకు సమంజసం...?

కలిసి మెలిసి బ్రతకాలని, జీవితాంతం కలిసి జీవించాలని, ఏడేడు జన్మలకు తమ ప్రియులే భార్యా-భర్తలుగా మళ్ళీ పుట్టాలని కోరుకుని మరీ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కాస్త పెళ్ళి అనే పేరుతో ఆ కార్యం కాస్తా పూర్తయిన తర్వాత గతంలో తాము చేసిన ఆ వాగ్దానాలు ఏమైనట్టు..?

Gulzar Ghouse|
తమకు అవసరం ఉన్నంత వరకు ఎదుటివారిని ప్రేమ అనే పేరుతో వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత తమ ప్రియమైన వారిని గాలికి వదిలివేయడం ఎంతవరకు సబబు...? ఇదేనా ప్రేమంటే...ప్రేమకు అర్థం తెలుసుకుని, ఆ ప్రేమను ఆస్వాదించే గుణం మీలో వుంటే ప్రేమను ప్రేమించండి. ప్రేమను మాత్రం వంచించకండి అంటున్నారు నిజమైన ప్రేమ రోగులు.


దీనిపై మరింత చదవండి :