శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Selvi
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:03 IST)

గణపయ్య జననం గురించి మీకు తెలుసా? విష్ణువు గంగిరెద్దుగా ఎందుకు మారాడు?

సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సుచే శివునిని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరము న

సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సుచే శివునిని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరము నందే నివసించాలని కోరుతాడు. ఆ ప్రకారం శివుడు అతడి పొట్టలో బందీ అవుతాడు. అతడు అజేయుడవుతాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి దుఃఖితురాలైంది. 
 
శంకరుడు లేని జగత్తు ఎందుకని.. తన భర్తను విడిపించే ఉపాయమును చెప్పాల్సిందిగా విష్ణువును కోరింది. అంతే విష్ణువు గంగిరెద్దు వేషంతో గజమాఖాసురుడిని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంలో ఏమి కావాలో కోరుకోమంటాడు. విష్ణుదేవుని వ్యూహము ప్రకారం నీ ఉదరమున ఉన్న శివుడిని కోరుతాడు. దీంతో తన అంత్యకాలము దాపురించిందని గమనించిన గజముఖుడు.. మాట తప్పకుండా పొట్టలో ఉన్న శివుడిని ఉద్దేశించి ప్రభూ.. శ్రీహరి ప్రభావముతో తన జీవితము ముగిసిపోయేట్లుందని.. తన తర్వాత తన శిరస్సు త్రిలోక పూజితం కావాలని కోరుకుంటాడు. 
 
తన చర్మము నిరంతరం నీవు ధరించునట్లు అనుగ్రహించాలంటాడు. ఆపై నందీశ్వరుడు గజముఖుడి ఉదరము చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకుని కైలాసానికి వెళ్తాడు. మరోవైపు భర్త రాక తెలుసుకుని పార్వతీ దేవి పరమానందంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా, స్నానాలంకారముల ప్రయత్నములో తనకు ఉంచిన నలుగు పిండితో ఓ ప్రతిమను చేసింది. అది చూడముచ్చటగా బాలుగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ట చేసింది. 
 
అంతకు పూర్వమే తన తండ్రి అగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసి.. ఆ దివ్య సుందరమైన బాలుడిని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు శివుడిని పార్వతి వద్దకు పోనివ్వలేదు. అంతే శివుడు కోపముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు. జరిగిందంతా విని పార్వతి విలపించింది. 
 
శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికిస్తాడు. అలా గజముఖుడికి త్రిలోకపూజనీయతను కల్పించినాడు. గణేశుడు శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు మూషిక రూపమున వినాయకుడిని వాహనమైనాడు. అలా గజముఖుడు త్రిలోక పూజ్యుతుడు కాగా, విఘ్నేశ్వరుడు ఆది దేవుడైనాడు.