సర్వప్రాణికోటి జీవామృతం నీరు

WD
భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు. అలాగే మానవుడు కూడా. మనిషిలో 35నుండి 40 లీటర్ల నీరు ఉంటుంది. ఈ నీరు ఏ విధంగానైతే శరీరంపైవున్న మురికిని శుభ్రం చేస్తుందో అలాగే శరీరం లోపలి భాగంలోనున్న మలినాలను కూడా కడిగివేస్తుంది.

నీరు అధికంగా తీసుకోవడంవలన ఎలాంటి నష్టం కలగదు. ఎలాగైనా ఆనీరు బయటకు వచ్చేసేదే. దీంతోపాటు మన శరీరానికి అవసరంలేని పదార్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి.

ఒక యువకుని బరువులో దాదాపు 65శాతం నీరువుంటుంది. అలాగే యువతి తన శరీరంలోని బరువులో 52 శాతంవరుకు నీరు వుంటుంది. మానవుని శరీరంలోనున్న ఎముకలలో 22 శాతం నీరే ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. దంతాలలో 10 శాతం, చర్మంలో20శాతం, మస్తిష్కంలో 74.5 శాతం, రక్తంలో 83 శాతం, కండరాలలో 75.6 శాతం నీరు వుంటుందని వైద్యులు తెలిపారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ప్రతి రోజు మానవుని శరీరంలో 2.3 నుండి 2.8 లీటర్ల నీరు విభిన్నమార్గాలగుండా బయటకు వెళ్ళిపోతుంది. మలమార్గం ద్వారా 0.13లీటర్లు, మూత్రం ద్వారా 1.5 లీటర్ల నీరు, చర్మం నుండి చెమట రూపంలో 0.65 లీటర్లు, శ్వాసక్రియ ద్వారా ఊపిరి తిత్తుల నుండి 0.32 లీటర్ల నీరు బయటకు వెళ్ళిపోతుంది. కనుక ప్రాణాధారమైన ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఈ అంతర్జాతీయ జల దినోత్సవం పిలుపునిస్తోంది.


దీనిపై మరింత చదవండి :