భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకుకూడా చాలెంజ్‌గా మారింది. దృష్టి లోపంతో భాధపడేవారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అలాగే వారు శారీరకంగాకూడా పరిశుభ్రతను పాటించాలి. ఇలాంటి వారు ఆటపాటలలో, పరుగుపందేలలో పాల్గొనలేక పోతుంటారు. కాబట్టి ఇలాంటివారు యోగాసనాలు చేస్తే ఆరోగ్యంగానే కాకుండా మానసికంగాకూడా దృఢంగానే ఉంటారని యోగా నిపుణులు అంటున్నారు.