1. సమతల ప్రాంతంపై పడుకుని శరీరాన్ని సమాంతరంగా ఉంచండి. కాళ్లను పైకి చాపి చేతులను వదులుగా ఉంచాలి. అరచేతులను భూమికి ఆన్చాలి. 2. గాలి పీలుస్తూనే మోకాళ్లను ఛాతీ సమీపానికి తీసుకురావాలి. అరచేతులను వెనక్కు తిప్పాలి. తొడలను పైకిలేపే సమయంలో పిర్రలకు సహాయంగా అరచేతులు ఆన్చాలి. 3. అరచేతులను తొడల లోపలికి పోనిచ్చి మోకాళ్లను నుదురు సమీపానికి తీసుకురావాలి. ఈ సమయంలో కాళ్లను నేరుగా పైకి ఎత్తాలి. 4. ఊపిరి వదులుతూ వెన్ను, కాళ్లను నేరుగా ఉంచుతూనే మోచేతులను భుజాలకు సమాంతరంగా లేపాలి. కాళ్లను నేరుగా పైకి చాపి కాలి వేళ్లను సడలించాలి. వీటితోపాటే కాళ్లు, శరీరాన్ని కొద్దిగా సడలించాలి. 5. అరచేతులను భుజాల మీదకు తీసుకురావాలి. 6. ఊపిరి తీసుకుంటూనే భంగిమ నుంచి సాధారణ స్థితికి రావాలి. ఊపిరి వదులుతూ మోకాళ్లను వంచుతూ ఛాతీ మీదకు తీసుకురావాలి. చిన్నగా తొడలను కిందకు దించుతూ పిరుదులను నేలకు ఆన్చాలి. కాళ్లను నిటారుగా ఉంచి చేతులను సడలించాలి.