మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి.కాలిమడమలను బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.చుబుకాన్ని నేలకు ఆనించాలి.అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి.మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక ప్రక్కగా ఉంచండి.మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు.ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి. నాభిస్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి.తిరిగి మెల్లగా మకరాసనంలోకి రండి.