చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సౌధాన్లో నిలబడడం) రెండు కాళ్ళను ఒకదానికొకటి దూరం జరపాలి. అంటే విశ్రామ్‌లో నిలబడడమన్న మాట. కుడి చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి. అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి. అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి. భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి. అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు ఎడమవైపుకు వంచాలి. అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.