Bbc Telugu

Notifications

  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు



నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)కన్నడ బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఆమె తన కజిన్‌తో కలిసి పార్క్ చేసి ఉన్న తన కారు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వారిని వెంబడించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి నడుస్తూనే అత్యంత అసభ్యకరమైన చేష్టలకు పాల్పడ్డాడు. రాత్రివేళల్లో నడిచినంత మాత్రాన ఏ మహిళ కూడా ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను దివ్య సురేష్ తన మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కారులోకి వెళ్లగానే ఆ వ్యక్తి మరింత దగ్గరకు రావడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని ఆమె కజిన్ కోరడం ఆ వీడియోలో రికార్డయ్యింది.