ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, బ్రౌన్ రంగుల్లో లెక్కకుమించీ కనిపించే గుళ్ళు, గోపురాలు, గుహలు, అంతఃపురాలను పోలిన ప్రకృతి చెక్కిన శిల్పాలు బ్రైస్ కన్యోన్ నేషనల్ పార్కులో చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. రక రకాల ఆకృతుల్లో, వినూత్నమైన శిల్పాలు నిండి ఉండే ఈ సన్నటి లోయలో చిత్ర విచిత్రమైన రంగులతో రాళ్లన్నీ గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంటుంది.