శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:07 IST)

మళ్లీ వంటగ్యాస్ బాదుడు... తాజాగా రూ.25 వడ్డన

సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి.  ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై 25 రూపాయల వరకు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకుంది. 
 
అలాగే కమర్షియల్‌ సిలిండర్‌పై 75 రూపాయల వరకు పెంచింది. పెరిగిన ఈ ధరలు ఈ రోజు (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. 
 
తాజా ధరల ప్రకారం.. ఇక 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.912 ఉండగా, ఇక ఢిల్లీలో ధర రూ.884, అలాగే కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.-875.50 ఉంది
 
ధరలు పెరగడంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం.
 
ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది. గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు కావడం సామాన్య జనాలకు షాకిచ్చినట్లవుతుంది. 
2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. అదేసమయంలో ఈరోజు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.75 పైకి కదిలింది.
 
ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సిలిండర్ బుకింగ్, డెలివరీ బాయ్ తీసుకునే చార్జీ కలుపుకొంటే దాదాపుగా రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ లభించని పరిస్థితి నెలకొంది.