శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 డిశెంబరు 2024 (22:19 IST)

అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్‌తో గిఫ్టింగ్ సంస్కృతి దశాబ్ద ఆనందం, సంబరం

Amazon
అమేజాన్ విధానంలో బహుమతులను అందచేసే సౌకర్యం మరియు విలక్షణలతో కస్టమర్లను ఆనందపరిచే దశాబ్దపు సంబరాలలో భాగంగా, భారతదేశపు కస్టమర్లకు బిలియన్‌కు పైగా గిఫ్ట్ కార్డ్స్‌ను విజయవంతంగా అందచేసానని అమేజాన్ పే ప్రకటించింది. ఇది విస్తృతమైన భారతదేశపు గిఫ్ట్ కార్డ్ మార్కెట్లో ఈ కార్డ్స్‌కు పెరుగుతున్న ఆదరణను చూపించింది. క్విక్ సిల్వర్ బ్రాండ్ పేరు కింద పైన్ ల్యాబ్స్ ద్వారా, అమేజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అమేజాన్ పే)తో బ్రాండ్‌తో జారీ చేయబడిన ఇవి 2014 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన నాటి నుండి, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ కస్టమర్లకు స్థిరంగా విలువను అందచేసాయి, ఇయర్-ఆన్-ఇయర్‌లో రెండంకెల వృద్ధిని చూపించాయి.
 
అమేజాన్ పే ఇప్పుడు అమేజాన్ షాపింగ్ వోచర్స్, అమేజాన్ ఫ్రెష్ వోచర్స్, అమేజాన్ ప్రైమ్ వోచర్స్, కొత్త అమేజాన్ గోల్డ్ వోచర్స్ సహా విస్తృత శ్రేణి గిఫ్ట్ కార్డ్ ఆప్షన్స్‌ను అందిస్తోంది. తమ బహుమతుల ఎంపికలలో మరింత సరళతో తమ కస్టమర్లకు కేటాయించడానికి ఇవి రూపొందించబడ్డాయి. ఈ ఆఫరింగ్స్ విస్తృత శ్రేణి ప్రాధాన్యతలను అందిస్తాయి, ప్రతి ఒక్కరి కోసం ఏదైనా అందచేయడాన్ని నిర్థారిస్తాయి.
 
400 మిలియన్‌కి పైగా విస్తరించిన గేమర్స్‌తో, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గేమింగ్ వర్గం యొక్క అవసరాలు తీర్చడానికి, అమేజాన్ పే యాపిల్ యాప్ స్టోర్, వలోరంట్, యూనిపిన్, స్టీమ్, ప్లే స్టేషన్ వంటి ప్రసిద్ధి చెందిన ప్లాట్ ఫాంస్ కోసం గేమింగ్ గిఫ్ట్ కార్డ్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త గిఫ్ట్ కార్డ్స్ వేగంగా ప్రసిద్ధి చెందాయి, అమేజాన్ పే యొక్క ఇప్పటికే ఉన్న గిఫ్ట్ కార్డులతో పోల్చినప్పుడు నెలవారీ సేల్స్‌లో 10% పెంపుదలను ప్రోత్సహిస్తున్నాయి.
 
నేహా గుప్తా మహాత్మ, డైరెక్టర్- స్టోర్డ్ వేల్యూ & గిఫ్టింగ్, అమేజాన్ పే, వార్షికోత్సవం గురించి ఇలా అన్నారు, “అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్‌ను గత దశాబ్దంగా ఒక నమ్మకమైన, ప్రాధాన్యత గల ఎంపికగా చేసినందుకు మా కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బిలియన్‌కు పైగా గిఫ్ట్ కార్డ్స్‌ను అందచేయడంతో, లక్షలాది కస్టమర్లు సరళమైన, అర్థవంతమైన విధానంలో బహుమతి యొక్క ఆనందాన్ని భాగస్వామం చేసుకున్నారు. 2024 అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లల్లో 40% పెంపుదల మా కస్టమర్లు చూపించిన ప్రేమ, వారికి పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబించింది. మనం ఈ విజయాన్ని సంబరం చేస్తుండగా, మా కస్టమర్ల యొక్క అవసరాలు, ప్రాధాన్యతలను నిజంగా నెరవేర్చే బహుమతి పరిష్కారాలను నిరంతరంగా మెరుగుపరిచి, కేటాయించడం పైన మేము దృష్టి కేంద్రీకరించాము.“
 
10వ సంవత్సరం వార్షికోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, నవీన్ చందాని, ప్రెసిడెంట్- ఇష్యూయింగ్ బిజినెస్, గ్లోబల్, పైన్ ల్యాబ్స్‌లో ఇలా అన్నారు, “అమేజాన్ పేతో మా దశాబ్దపు తరబడి భాగస్వామం భారతదేశంలో గిఫ్ట్ కార్డ్ అనుభవాన్ని పునః రూపొందించడంలో  ముఖ్యమైన సాధనంగా నిలిచింది. అమేజాన్ పే యొక్క చేరిక మరియు బ్రాండ్ విధేయతతో పైన్ ల్యాబ్ టెక్ నైపుణ్యతను కలిపింది. కలిసికట్టుగా, మేము లక్షలాది కస్టమర్లకు సహాయపడే దృఢమైన, కొలవదగిన గిఫ్ట్ కార్డ్ పరిష్కారాన్ని పరిచయం చేసాం మరియు ప్రజల్లో గణనీయమైన విలువను ప్రోత్సహించడాన్ని కొనసాగిస్తాం. మేము ఈ విజయాన్ని సంబరం  చేస్తుండగా, పైన్ ల్యాబ్స్ మా ప్లాట్ ఫామ్స్‌ను మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది, భారతదేశపు అభివృద్ధి చెందుతున్న పోకడలకు ప్రతిస్పందించే సురక్షితమైన, విలక్షణమైన మరియు వినూత్నమైన కార్డ్ జారీ మరియు ప్రాసెసింగ్ పరిష్కారాలను అందిస్తోంది.”