ఉమ్రాన్ స్థానంలో ఆ క్రికెటర్‌ను తీసుకోవాలి : మాజీ క్రికెటర్

ఆదివారం, 29 జనవరి 2023 (11:36 IST)
స్వదేశంలో న్యూజిలాండ్‌ జట్టుతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు.. తొలి టీ20లో చతికిలబడింది. ఇటు బౌలింగ్‌తోపాటు అటు బ్యాటింగ్‌లోనూ తేలిపోవడంతో టీ20 సిరీస్‌ను హార్దిక్‌ సేన ఓటమితో మొదలెట్టింది. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ సూచించాడు.
 
పొట్టి ఫార్మాట్‌లో పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తీవ్ర నిరాశ పరుస్తున్నాడని.. బౌలింగ్‌లో వేరియేషన్స్‌ చూపించడం లేదని జాఫర్‌ అన్నాడు. అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించకపోతే ఈ ఫార్మాట్‌లో ఇబ్బందులకు గురవుతాడు. 
 
తొలి మ్యాచ్‌లో కట్టర్లు మంచి ఎంపిక. కానీ అతడు అలా బౌలింగ్‌ చేయలేదు. రాంచి లాంటి పిచ్‌లపై పేసర్లు వైవిధ్యంతో బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. స్థిరమైన వేగంతో బంతులు విసిరితే నష్టమే అని జాఫర్‌ పేర్కొన్నాడు. 
 
రెండో టీ20లో ఉమ్రాన్‌ స్థానంలో జితేశ్‌ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. 'ఉమ్రాన్‌ స్థానంలో జితేశ్‌ను తీసుకోవాలి. లేదంటే పృథ్వీషాను కూడా ఆలోచించొచ్చు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలంటే జితేశే ఉత్తమ ఎంపిక' అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు, న్యూజిలాండ్‌తో రెండో టీ20ని భారత్‌ ఆడనుంది. 

అన్నీ చూడండి

బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు చీమల బారుల్లా వెళ్లిపోతున్న బంగ్లాదేశీయులు, వీడియో

కన్నతల్లినే పక్కలోకి రమ్మన్న కామాంధ కొడుకు, పళ్లతో కొరికి, తలపై కొట్టి, వీడియో

SIRతో జాగ్రత్త, స్టాలిన్, మమతా బెనర్జీ అందుకే ఓడిపోయారు, మనం మరో రకంగా ఓడాము: జగన్

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది : సుప్రీంకోర్టు

దేశంలో భానుడి భగభగలు... పౌరులకు ప్రధాని మోడీ సూచనలు

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments