1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (13:14 IST)

ప్రాణాలు తీసిన ఔట్ అప్పీల్ : ఢాకాలో దారుణం!

కీపర్‌ని వికెట్‌తో పొడిచిచంపి ఓ బ్యాట్స్‌మెన్ కలకలం సృష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢాకా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో బాబుల్ సిక్దర్ అనే 16 ఏళ్ల వికెట్ కీపర్... ఓ బంతికి బ్యాట్స్‌మెన్ 'అవుట్'.. 'అవుట్' అంటూ గట్టిగా అరిచాడు. దీంతో బ్యాట్స్‌మెన్‌కి కోపం కట్టలు తెంచుకుంది. నో బాల్‌కు కూడా అప్పీలు చేయడాన్ని ఆ బ్యాట్స్‌మన్ తట్టుకోలేకపోయాడు. 
 
తనను రెచ్చగొట్టేందుకే సిక్దర్ అలా అప్పీలు చేస్తున్నాడన్న క్షణికావేశంతో అక్కడున్న వికెట్‌ను శరవేగంగా పీకి.. అందరూ చూస్తుండంగా అతని మెడపై పొడిచేశాడు. వికెట్ అతని మెడలో దిగబడడంతో బాబుల్ సిక్దర్ అక్కడికక్కడే కిందపడిపోయాడు. సహచర ఆటగాళ్లు సిక్దర్‌ని ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. దీంతో భయాందోళనకు గురైన బ్యాట్స్‌మెన్ పరారయ్యాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.