ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (10:06 IST)

క్రికెట్ మైదానంలో ప్రమాదం: షోయబ్ మాలిక్ తలకు గాయం.. విలవిల్లాడిన సానియా భర్త

మృతి చెందడం యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే గత ఏడాది బౌలర్‌ వేసే బంతిని సరిగ్గా అంచానా వేయక పోవడం వల్ల మైదానంలో పాకిస్తాన్‌కు చెందిన జుబైర్‌ అహ్మద్‌ మర్దాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్

Shoaib Malik
క్రికెట్ మైదానంలో ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి చెందడం యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే గత ఏడాది బౌలర్‌ వేసే బంతిని సరిగ్గా అంచానా వేయక పోవడం వల్ల మైదానంలో పాకిస్తాన్‌కు చెందిన జుబైర్‌ అహ్మద్‌ మర్దాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ విసిరిన బౌన్సర్ అతని తలను బలంగా తాకింది.దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
అయితే తాజాగా ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ కుప్పకూలిపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న షోయబ్‌ను వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు. భారత టెన్నిస్ స్టారీ, హైదరాబాదీ సానియా మీర్జా భర్త అయిన షోయబ్ మాలిక్.. హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ప్రమాదానికి గురైయ్యాడు. 
 
ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మున్రో చేతికి చేరడంతో అవతలి ఎండ్‌లో ఉన్న మహమ్మద్ హఫీజ్ వద్దని వారించాడు. దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు. ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మున్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. అయితే దెబ్బ బలంగా తాకడంతో మాలిక్ (6) వెంటనే పెవిలియన్ దారి పట్టాడు.