ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (19:16 IST)

యోగి వేమనలా కోహ్లీ అర్ధనగ్న ఫోటో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధనగ్న దుస్తులు నెట్టింట చర్చకు దారితీశాయి. యోగి టైపులో షర్ట్ లేకుండా షార్ట్స్‌తో కూర్చుని వున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఫోటోను కోహ్లీ పోస్టు చేస్తూ.. అంతర్గత మనస్సు గురించి తెలుసుకున్నవాళ్లు.. బయట దేన్ని వెతకాల్సిన అవసరం వుండదని ట్వీట్ చేశాడు. ఫ్యాన్స్ ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తుంటే.. ట్రోలర్స్ మాత్రం ట్రోలింగ్ మొదలెట్టారు. 
 
'కోహ్లీ.. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత చలానా వేశారేంటి?' అని కామెంట్స్ చేస్తున్నారు. వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ విజయంతో అతడు భారత అత్యుత్తమ సారథిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో అచ్చం యోగి వేమన తరహాలో వుందని కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ మధ్యే ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ పెట్టుకోలేదని ఒకరికి రూ.23,000 చలాన్‌ వేసిన సంగతి తెలిసిందే. దాంతో విరాట్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా భారీగా డబ్బులు ఇచ్చుకున్నాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా సైటరికల్ కామెంట్స్‌తో కోహ్లీ అర్ధనగ్న ఫోటోను వైరల్ చేస్తున్నారు.