శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఆగస్టు 2025 (11:42 IST)

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

woman victim
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుపడేలా లైంగికంగా వేధిస్తున్న భర్తపై విజయవాడ అజిత్ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య నగర్‌కు చెందిన యువతి.. న్యూగిరిపురానికి చెందిన అనిల్‌ కుమార్‌ను 2008లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
 
ఈమె, ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్.ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. భర్త పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. కొంతకాలం బాగానే చూసుకున్నాడు. తర్వాత కట్నం తీసుకునిరావాలని వేధిస్తుండడంతో రూ.20 లక్షల వరకు తెచ్చారు. అయిన ప్రవర్తన మార్చుకోకుండా వధిస్తున్నాడు. 
 
వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికే ప్రవర్తనతో వేధించేవాడని, నిరాకరించడంతో ఒక రోజు ఇంట్లో గ్యాస్ వదిలేసి చంపుతానని బెదిరించాడు. మామ కూడా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అజిత్ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.