బహుభాషా చిత్ర నిర్మాణ సంస్థగా ప్రసిద్ధి చెందిన ఎవిఎం ప్రొడక్షన్ రూపొందిస్తోన్న చిత్రాలపై సగటు సినిమా ప్రేక్షకుడికి ఆసక్తి మెండుగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దిశగా తమ సంస్థ చిత్రాలను నిర్మిస్తోందని ఎవిఎం అధినేతలంటున్నారు. తాజాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఎవిఎం సంస్థ ఏకకాలంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలయ్యే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో తమకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్న సూర్య, తమన్నా జంటగా వీడొక్కడే అనే చిత్రాన్ని కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ఎవిఎం తెరకెక్కిస్తోంది.