రామ్‌ చరణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి చిత్రం

rem charan
PNR| Last Modified శనివారం, 8 అక్టోబరు 2011 (16:37 IST)
WD
WD
'మగధీర' ఫేమ్‌ రామ్‌చరణ్‌ హీరోగా 'బృందావనం' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... మా బేనర్‌లో వంశీ రెండు చిత్రాలకు హిట్‌ ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ మా బ్యానర్‌లో నటిస్తున్న మొట్టమొదటి చిత్రం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందన్నారు.

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో నటీనటుల ఎంపిక జరుగుతుంది. వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ రామ్‌చరణ్ కథ విని చాలా ఉద్విగ్నతకు లోనయ్యారు. వెంటనే అంగీకరించారు. స్క్రిప్ట్‌ దశలోనే ఉంది అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :