'ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా

Venkateswara Rao. I| Last Modified గురువారం, 13 జూన్ 2013 (17:42 IST)
"బూతు చిత్రాలను తీస్తున్నాననే నింద మోసుకున్నాను. ఇండస్ట్రీలో చాలామంది అదేరకంగా నన్ను చూస్తున్నారు. అందుకే బూతే కాదు, మంచికథ, హాస్యం ఉన్నా సినిమా చూస్తారని 'ప్రేమకథా చిత్రమ్‌' ద్వారా నిరూపించుకున్నాన"ని దర్శకుడు మారుతి అన్నారు.

ఈరోజుల్లో చిత్రం తీసినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా యూత్‌ ఉన్నారు. వారికి కరెక్ట్‌ కథే అని తీశాను. ఆ తర్వాత బస్టాప్‌ తీశాను. యువతులు ప్రేమ పేరుతో తల్లిదండ్రుల ఆశయాల్ని, నమ్మకాల్ని వమ్ము చేస్తున్నారని సినిమా తీశాను. అది కరెక్ట్‌ అని తెలిసింది. ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఇండస్ట్రీనే నన్ను వేరేగా చూసింది. ప్రేమకథా చిత్రమ్‌తో నన్ను అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు.


దీనిపై మరింత చదవండి :