అక్కినేని అఖిల్ 'మనం'లో నటించట్లేదు!

Ganesh| Last Modified బుధవారం, 20 నవంబరు 2013 (12:34 IST)
FILE
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న 'మనం' సినిమాలో చిన్న కొడుకు అఖిల్ కూడా నటిస్తాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అఖిల్ మనం సినిమాలో గెస్ట్‌రోల్‌ పోషిస్తున్నాడని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో అఖిల్ చేయటం లేదని తేలింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

ఈ మల్టీస్టారర్‌లో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మందు కొట్టే సీన్ ఉందట. నాగేశ్వరరావు, నాగార్జున, కలిసి ఈ సీన్ అద్భుతంగా నటించారని, నైగచైతన్య కాస్త ఇబ్బంది పడినప్పటికీ నాగ్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో ఈ సీన్ బాగా చేసాడని సమాచారం.


దీనిపై మరింత చదవండి :