వెంకటేష్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో ఓ కీలక పాత్రకు తమిళ నటుడు రాజ్ కిరణ్ ఎంపికయ్యాడు. 'పందెం కోడి', 'ముని' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు పరిచయస్తుడే. ఈ సినిమాలో చరణ్ తాత పాత్ర చాలా కీలకమైన పాత్ర. దీని కోసం మొదట్లో సూపర్ స్టార్ కృష్ణను ప్రయత్నించారు.