రామ్ చరణ్‌కు యంగ్‌ బాబాయిగా శ్రీకాంత్

Ram charan and Srikanth
Venkateswara Rao. I| Last Modified శుక్రవారం, 3 జనవరి 2014 (19:00 IST)
WD
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణల కాంబినేషన్‌లో విలన్‌గా, హీరోగా యాక్ట్‌ చేశాను. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు ఆనందంగా ఉందంటున్నాడు హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంకా మాట్లాడుతూ... 'చరణ్‌ నాకు చిన్నప్పటి నుండి బాగా అలవాటు. అతనితో మంచి ర్యాపో ఉంది. అనుకోకుండా వచ్చిన అవకాశమిది. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్‌ చేస్తున్నాను.

హీరో మాత్రమే చేయగలిగిన పాత్ర ఇది. నా కెరియర్‌కి చాలా ఉపయోగపడే చిత్రమవుతుంది. ఖడ్గం, మహాత్మ సినిమాలతో కృష్ణవంశీతో మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది. అతని స్టైల్‌ గురించి కొత్తగా చెప్పవసరం లేదు. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం హెయిర్‌ బాగా పెంచమన్నాడు. ఇంకా హీరోయిన్‌ ఎంపిక కాలేదు.

ఫిబ్రవరి నుండి నా షెడ్యూల్‌ ఉంటుంది' అని శ్రీకాంత్‌ చెప్పారు. వారి అబ్బాయి రోషన్‌ గురించి చెబుతూ.. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రుద్రమదేవిలో రానా చిన్నప్పటి క్యారెక్టర్‌ చేస్తున్నాడు. ఎదిగాక అతనికి ఏది ఇష్టమైతే అదే చేయిస్తాను. అమ్మాయిని మాత్రం చిత్ర పరిశ్రమలోకి తీసుకురాను అని చెప్పారు.


దీనిపై మరింత చదవండి :