సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం 'ఆగడు'. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' ఎంత హిట్టయిందో తెలిసిందే. 'దూకుడు' సినిమాతో మహేష్కు మంచి విజయాన్ని అందించిన శ్రీను వైట్ల మరోసారి ప్రిన్స్కు భారీ విజయం ఇవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు.