ఎవడు సినిమా తర్వాత రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్, కమలిని ముఖర్జీలు కూడా ప్రధాన భూమిక పోషించనున్నారు.ప్రస్తుతం పొల్లాచ్చిలో ప్రకృతి అందాల నడుమ చరణ్, కాజల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.