తెలుగులో 'ట్రాఫిక్' చిత్రాన్ని అందించిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్య నారాయణ అందిస్తున్న మరో ప్రతిష్టాత్మక అనువాద చిత్రం 'వీరుడొక్కడే'. అజిత్, తమన్నా జంటగా 'శౌర్యం' ఫేమ్ శివ దర్శకత్వంలో 'వీరమ్' పేరుతో తమిళంలో రూపొంది.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 'వీరుడొక్కడే' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.