మిస్టర్ నోకియాగా మంచు మనోజ్ సింగిల్ హ్యాండ్‌పై నడిపాడు. దర్శకుడికన్నా తనే ఎక్కువడా డీల్ చేసినట్లు.. యాక్షన్ సన్నివేశాల్లో తెలిసిపోతుంది. పక్కా మాస్ క్యారెక్టర్‌ను మంచు మనోజ్ పోషించాడు. గ్లామర్ మినహా యాక్షన్ చేయడం అతనిలో ప్లస్‌పాయింట్. తన పాత్రను బాగా పోషించాడు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు నటనకు అవకాశం లేకున్నా... తగిన మోతాదులో నటించారు. వెన్నెల కిషోర్ నోకియాతో ఎంటర్‌టైన్ చేస్తాడు. మధ్యలో వచ్చే బ్రహ్మానందం... వయస్సు పెరిగినా బుద్ధి పెరగనివాడిలా కాసేపు అలరిస్తాడు. గ్యాంగ్‌స్టర్‌గా మురళీశర్మ పాత్రకు అమరాడు.టెక్నికల్‌గా.. స్టోరీలైన్ చాలా చిన్నది. మెక్సికన్ ఫిలిం 'లూసియా లూసియా' చిత్రంలోనిది. స్క్రీన్‌ప్లేను చెప్పడంలో తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు ప్రయత్నించాడు. మొదటి భాగం అల్లరి చిల్లరిగా ఉంటుంది. రెండో భాగంలో కథ కాస్త సాగుతుంది. అది కూడా రొటీన్‌గా ఉన్నా కొన్ని ట్విస్ట్‌లు కన్పిస్తాయి. | Mr Nookayya Telugu Movie Review