స్వాతి-నవదీప్‌ల 'బంగారు కోడిపెట్ట' రివ్యూ రిపోర్ట్!

Ganesh| Last Modified శుక్రవారం, 7 మార్చి 2014 (15:24 IST)
FILE
నటీనటులు: నవదీప్‌, స్వాతి, హర్షవర్ధన్‌ తదితరులు

నిర్మాత: సునీత తాట. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ పిప్పాళ్ళ.

కథ పెద్దగాలేకపోయినా ఫర్వాలేదు కథనాన్ని కొత్తగా నడిపి ఎంటర్‌టైన్‌మెంట్‌వేలో చెబితేచాలు సినిమా గట్టెక్కినట్లే. ఇదీ ఈనాటి ఎన్‌ఆర్‌ఐలుగా సినిమాలు తీయడానికి తెలుగులో ముందుకువచ్చిన వారి పాలసీ కొద్దిరోజుల క్రితమే వచ్చిన డి ఫర్‌దోపిడీ సినిమా కూడా చిన్న పాయింట్‌తో తమ సమస్యలు గట్టెక్కడానికి బ్యాంక్‌ దొంగతనం చేయడం కాన్పెప్ట్‌‌తో వచ్చింది. ఈసారి... తమ సమస్యలను గటెట్టికంచుకోవడానికి బంగారాన్ని ఎలా కొట్టేయాలన్న పాయింట్‌ ఈ చిత్రం వచ్చింది. అది ఎలా చేశారో, తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే...

కథ...

వంశీ (నవదీప్‌) జీవీఆర్‌మాల్‌లోని ఓ సరుకులమ్మే దుకాణంలో సేల్స్‌మేన్‌. అందులో పనిచేసే భానుమతి పినిశెట్టి (స్వాతి)కూడా డిటోనే. చదివింది 8వతరగతైనా ఫేక్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో జాయిన్‌ అవుతుంది. కూల్‌డ్రింక్‌ తాగితే బంగారు గోల్డ్‌కాయిన్‌ మీకేనంటూ ఆమె పబ్లిక్‌ను ఎట్రాక్‌ చేయడం ఆమె డ్యూటీ. బాగా పనిచేసినా ఫేక్‌ సర్టిఫికెట్‌ అని తెలుసుకున్న మేనేజర్‌ (హర్షవర్ధన్‌) ఉద్యోగంలోంచి తీసేస్తాడు. తిరిగి ఆమె సర్టిఫికెట్లు ఇచ్చే సందర్భంలో పైనుంచి బంగారుబిస్కెట్లువచ్చే లారీలోడ్‌ వివరాలు వాటిపై రాసేస్తాడు. ఏం చేయాలో పోలుపోక ఆలోచిస్తున్న భానుమతికి ఆ నెంబర్‌ చూడగానే దాన్ని కొట్టేయాలనే ఆలోచన కలుగుతుంది. ఇందుకు వంశీ సాయం అడుగుతుంది. ఇద్దరూ స్కెచ్‌ వేస్తారు. అయితే ఫైనల్‌గా వచ్చేసరికి అసలు ఇది మా ఇద్దరిప్లాన్‌ అంటూ మేనేజర్‌ భానుకు జలక్‌ ఇస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.

సింపుల్‌ స్టోరీతో గమనాన్నిస్లోగా లాగించే కథలు ఇటీవల ఎక్కువయ్యాయి. హాలీవుడ్‌లో చిన్నపాటి సినిమాలు ఒకరకంగా డాక్యుమెంటరీలు తీస్తున్న పాయింట్‌ను ఎంచుకుని తెలుగులో సినిమాలుగా తీసేయడం అలవాటు చేసుకున్నారు. పెట్టిన ఖర్చు తక్కువే, పబ్లిసిటీకి కొంచెం కష్టపడ్డారు. అయితే అటూ లేకపోతే ఇటూగా చిత్రాలు తీసే కోవలో ఈ చిత్రనిర్మాత చేరుతాడు. ఇందులో ఎక్కడా లాజిక్కులు చూడకూడదు. బంగారు బాక్స్‌లు వచ్చే లారీని కొట్టేయాలి. ఈ దశలో సెక్యూరిటీ ఉన్నా వారిని మీ ప్రాణాలుకావాలా ఈ లోడు కావాలంటూ చిన్న మాటతో తేల్చేస్తాడు. ఆ తర్వాత చాలాసేపటికి వంశీ కారు పనిచేయదు. ఈలోపల మరో రెండుమూడు పాత్రలు అటుగా రావడం.. వారిదో ఒక్కోక్కరిది ఒక్కో కథ అంటూ మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్ళడం జరుగుతుంది. ఇలా రివర్స్‌ స్క్రీన్‌ప్లేలో దర్శకుడు చూపించాడు.

పోలీస్‌రికార్డ్‌ఉన్న వాడిగా వంశీ నటించాడు. ఇందులో నటించడానికి కొత్తదనం ఏమీలేదు. చాలా సాదాసీదాగానే పాత్ర ఉంటుంది. స్వాతి పాత్రకూడా అంతే. చాలా ఈజీగా చేసేసింది. కానీ క్లోజ్‌ షాట్స్‌లో గతంలో ఉన్న గ్లామర్‌ కన్పించదు. వయస్సుపడిన లక్షణాలు కన్పిస్తున్నాయి. హర్షవర్దన్‌ మేనేజర్‌గా బాగానే చేశాడు. సినిమా హీరో కావాలనే ఓ కొత్తపాత్రలో నూతన నటుడుఫర్వాలేదు. కవలలుగా ఎర్రబాబు, దొరబాబుగా ఫైటర్స్‌ రామ్‌లక్ష్మణ్‌లు నటించారు. అయితే వీరు నటించడానికి ఏమీలేదు. కేవలం కవలలుఅనే లాజిక్‌ తప్ప.

టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ సాదాసీదాగానేఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. పాటలు బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంటాయి. ఉన్నవి రెండే పాటలు 'బులి బులిపిట్ట... 'మబ్బు.. మబ్బు..' అనేవి సాహిత్యపరంగా, సంగీతపరంగా బాగున్నాయి. చిత్రంలో ఆకట్టుకున్నవి అవే.

సింపుల్‌ కథతో జనాల్ని ఆకట్టుకోవాలని రాజ్‌పిప్పాళ్ళ చేసిన ప్రయత్నమిది. అయితే ఇది ఏమాత్రం ప్రేక్షకుల్ని త్రిల్‌ కల్గిస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకప్ప్పుడు మార్నింగ్‌ షో సినిమాలనే సెపరేట్‌గా ఉండేవి. ఆ కోవలో ఈ చిత్రం పోతుంది.


దీనిపై మరింత చదవండి :