లెజెండ్ నటీనటులు : బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, జగపతి బాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్ తదితరులు; సంగీతం: దేవీశ్రీప్రసాద్, మాటలు: ఎం.రత్నం, కెమెరా: సి. రామ్‌ప్రసాద్, నిర్మాతలు: అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట. కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను.ముందుమాట... బోయపాటి శ్రీను చిత్రాలంటే అందులో యాక్షన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందులో హింస ఉంటుంది. చేసేది అగ్రహీరోలతో కాబట్టి దానికి తగినట్లుగా చిత్రాన్ని మలుస్తుంటాడు. తెలుగు సినిమా కథను రకరకాల జిమ్మిక్కులతో చూపించే సత్తా ఉన్న బోయపాటి శ్రీను... బాలకృష్ణ కాంబినేషన్‌లో నాలుగేళ్ళ నాడు 'సింహా' తెచ్చాడు. ఆ తర్వాత బాలయ్యకు సరైన హిట్ లేదు. మళ్ళీ ఇద్దరి కలయికతో వచ్చిన ఈ చిత్రం ఇప్పటి రాజకీయ నేపథ్యం కూడా టచ్ చేశాడు. అది ఎలా ఉందో చూద్దాం.