సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 డిశెంబరు 2025 (17:47 IST)

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

Doctors
క్యాన్సర్ సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక శక్తివంతమైన ముందడుగులో భాగంగా, కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (కేఎంపీఎల్), టాటా మెమోరియల్ సెంటర్‌లో భాగమైన అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) తో భాగస్వామ్యం కుదుర్చుకుని, నవీ ముంబైలోని ఖార్ఘర్‌లోని ఆ సంస్థ ప్రోటాన్ థెరపీ సెంటర్‌లో SDX వాలంటరీ బ్రీత్ హోల్డ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. శ్రీ సూరజ్ రాజప్పన్ ( కేఎంపీఎల్ ప్రెసిడెంట్, హోల్ టైమ్ డైరెక్టర్) శ్రీ మురళీధరన్ S (కేఎంపీఎల్ బిజినెస్ హెడ్)తో కలిసి ఈ సిస్టమ్ ప్రారంభించారు.
 
ఈ అధునాతన సాంకేతికత వైద్యులు చికిత్స సమయంలో రోగులు తమ శ్వాసను నిలిపి ఉంచేలా మార్గ నిర్దేశం చేయడం ద్వారా అధిక-కచ్చితమైన రేడియేషన్ థెరపీని అందించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం, ప్యాంక్రియాస్, రొమ్ములలోని క్యాన్సర్‌లకు ఇది చాలా ముఖ్యం. చికిత్స సమయంలో రోగి శ్వాస తీసుకోవడం వల్ల కణితులు వాటి స్థలం మారవచ్చు. రేడియేషన్ కణితిని మాత్రమే తాకేందుకు, ఆరోగ్యకరమైన అవయవాలను కాపాడేందుకు, చికిత్స ఫలితాలను మెరుగుపరిచేందుకు  SDX వ్యవస్థ తోడ్పడుతుంది.  
 
ఇది ఎందుకు ముఖ్యం?
ప్రోటాన్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతన రూపాలలో ఒకటి. ఈ భాగస్వామ్యం అత్యంత అధునాతన క్యాన్సర్ చికిత్సలు కూడా అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది.
 
SDX సిస్టమ్ టెక్నాలజీ ACTREC యొక్క ప్రోటాన్ థెరపీ సెటప్‌తో అనుగుణ్యంగా ఉంటుంది. మోషన్-సెన్సిటివ్ క్యాన్సర్‌లకు సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స చేయడానికి ఇది చాలా అవసరం.
 
ఈ వ్యవస్థ లేకుండా, ఉదాహరణకు, కాలేయ క్యాన్సర్‌కు ప్రోటాన్ థెరపీ అనేది శ్వాస తీసుకునేటప్పుడు అవయవం కదలిక (3 సెం.మీ వరకు) ఉండడం కారణంగా సురక్షితం కాకపోవచ్చు.
 
ఈ అప్‌గ్రేడ్‌తో, ACTREC ఇప్పుడు ప్రోటాన్-ఆధారిత SBRT (స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ)ని అందించగలదు. ఇది మనుగడను మెరుగుపరిచే, దుష్ప్రభావాలను తగ్గించే అధిక-కచ్చితమైన, అధిక-మోతాదు చికిత్స.
 
సమాన ఆరోగ్య సంరక్షణకు నిబద్ధత
ACTREC ఏటా 35,000 మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తుంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థికంగా బలహీ నమైన నేపథ్యాల నుండి వచ్చినవారే. ఈ భాగస్వామ్యం అత్యంత అధునాతన క్యాన్సర్ చికిత్సలు కూడా అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది.
 
ముంబైలోని టీఎంసీ, జీఐ డీఎంజీ రేడియేషన్ ఆంకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ కృష్ణత్రి మాట్లా డుతూ, “మోషన్ మేనేజ్డ్ రేడియేషన్ డెలివరీకి SDX వ్యవస్థ ఓ సంచలనం. కాలేయం, ప్యాంక్రియాస్‌  వంటి వాటిలో చికిత్సకు శ్వాస సమయంలో గణనీయంగా కదిలే కణితుల కచ్చితత్వం గురించి రాజీ పడలేం. ఈ మెరుగుదలతో, పరిమిత ఎంపికలు ఉన్న రోగులకు ప్రోటాన్-ఆధారిత SBRT (స్టీరియోటాక్టిక్ బాడీ రేడియో థెరపీ) అందించడానికి మేం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఇది నేరుగా మనుగడ ప్రయోజనం మరియు తగ్గిన దుష్ఫలితాలకు దారితీస్తుంది’’ అని అన్నారు.
 
ACTREC డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ, SDX వాలంటరీ బ్రీత్ హోల్డ్ సిస్టమ్ అనేది ACTREC ప్రోటాన్ థెరపీ సెటప్‌తో అనుగుణ్యమైన ఏకైక సాంకేతికత. ఇది మోషన్-సెన్సిటివ్ క్యాన్సర్‌లకు సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స చేయడానికి ఇది చాలా అవసరం. చాలా మంది అర్హులైన రోగులకు అత్యంత అత్యాధునిక చికిత్సా ఎంపికలను అందించడానికి వీలుగా తమ సాంకేతికతను మెరుగుపర్చడానికి, నవీకరించడానికి నిరంతరం కృషి చేసే రేడియేషన్ ఆంకాలజీ విభాగాన్ని నేను అభినందిస్తున్నాను.
 
ఒక సామాజిక ఆశయాన్ని గుర్తించి, దానికి దోహదపడినందుకు కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్‌కు టీఎంసీ తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా క్యాంపస్‌కు వారిని మేం ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాం  మా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, దేశ నిర్మాణంలో మా ప్రయత్నాలకు సహాయం చేయడానికి భవిష్యత్తు అవకాశాల కోసం చూస్తున్నాం. SDX వాలంటరీ బ్రీత్ హోల్డ్ సిస్టమ్ అనేది స్మార్ట్ బ్రీత్-హోల్డింగ్ కోచ్ లాంటిది. ఇది రోగులు, వైద్యులు కలిసి అధిక-కచ్చితమైన రేడియేషన్‌ను సురక్షితంగా అందించడానికి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ చికిత్సలో పెద్ద తేడాను కలిగించే ఒక చిన్న మార్పు.
 
ఒక లక్ష్యంతో సీఎస్ఆర్
ఈ కార్యక్రమం కేఎంపీఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిబద్ధతలో భాగం. ఇది తన దృష్టిని ఆరోగ్య సంరక్షణ రంగంపై కూడా పెట్టింది. మౌలిక సదుపాయాల నవీకరణలు, అధునాతన వైద్య సాంకేతిక తలతో సహా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందే అవకాశాలను మెరుగుపరిచే ప్రాజెక్టులకు కేఎంపీఎల్ మద్దతు ఇస్తుంది.
 
ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారందరికీ అందుబాటులో ఉండాలని కేఎంపీఎల్‌లో మేం విశ్వసిస్తున్నాం. టాటా మెమోరియల్ సెంటర్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా, ప్రతి రోగికి ప్రపంచవ్యాప్తంగా ప్రమా ణంగా ఉన్న క్యాన్సర్ సంరక్షణను అందించడంలో వారి ACTRECకి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం అని కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షారుఖ్ తోడివాలా అన్నారు.