వేసవి ఫుడ్... పుచ్చకాయ, కొబ్బరిబొండాం... ఇంకా...

మంగళవారం, 10 మే 2016 (16:56 IST)
వేసవి వచ్చిందంటే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. కనుక దీన్ని అడ్డుకునేందుకు అవసరమైన ఆహారాన్ని ఎంచుకుని తీసుకుంటూ ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దాం...
 
పరిశుభ్రమైన శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం. అలాగే శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా సేవించవచ్చు. సహజ సిద్ధమైన పోషక విలువలు ఉండే పండ్లను తిన్నట్లయితే.. శరీరాన్ని సమస్థితిలో ఉంచటమేగాక దాహార్తిని తీర్చి శరీరానికి స్వాంతననిస్తాయి.
 
పండ్లలో పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. రుచితోపాటు బి విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక.. అందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. వడదెబ్బ బారినుంచి కాపాడుతుంది. ఎండ తీవ్రతకు కమిలిపోయిన చర్మానికి స్వాంతననిస్తుంది. రక్తపోటును అరికడుతుంది. అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉండే కీరదోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.
 
కొబ్బరి నీళ్లను కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. ఇందులోని ఖనిజ లవణాలు వేసవి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరాన్ని తక్షణ శక్తి అందిస్తుంది. వేసవి తాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి. అలాగే చెరకు రసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రసంలో కార్బోహైడ్రేట్లు అపారంగా ఉంటాయి. దీంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో ఎప్పటికప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది.

అన్నీ చూడండి

టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు.. కారులో నగ్నంలో అట్టహాసం

వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. చంపేసిన సీక్రెట్ సర్వీస్ అధికారుల

వైకాపా అనుకూల పాస్టర్ చింతాడ ఆనంద్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రద్దు

బ్యాడ్మింటన్ ఆటగాడిని కిడ్నాప్ చేసి హింసించి చంపేసిన ప్రియురాలి ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments