డైనింగ్ టేబుల్ డెకరేషన్

WD
బంధువులు, స్నేహితులు ఇంటికి వస్తున్నారని తెలిస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తాం. వారికి రుచికరమైన వంటకాలను తయారు చేస్తాం. రుచికరమై ఆహారపదార్థాలతోపాటు వడ్డించే ప్రదేశమూ ఆహ్లాదంగా ఉండాలి. అదేనండీ డైనింగ్ టేబుల్. ఈ టేబుల్‌ను మీదైన అభిరుచితో మంచి అలంకరణలు చేయండి.

మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే తాజాపూలను డైనింగ్ టేబుల్‌పై అలంకరిస్తే బావుంటుంది. ఒకవేళ పూలు దొరకపోయినట్లయితే తాజా పండ్లను టేబుల్‌పై ఉంచండి. ఆకర్షణీయంగా ఉంటుంది.

మీరు డైనింగ్ టేబుల్‌పై పెట్టే భోజన పాత్రలకు నప్పే డైనింగ్ కవర్‌ను టేబుల్‌పై వేయండి. తెలుపు రంగులో ఉన్న పింగాణి పాత్రలను వడ్డించే పాత్రలుగా ఎంచుకుంటే చూసేందుకు బావుంటుంది.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఇప్పుడు పెద్ద పరిమాణంలో ఉన్న ప్లేట్లు ఫ్యాషన్. వీటిలో అన్ని రకాలైన వంటకాలను వేసే అవకాశం ఉంటుంది కనుక ప్రతిసారీ మరో పాత్రకోసం చూడక హేపీగా భోజనం చేయవచ్చు. ఒకవేళ బంధువులు, స్నేహితులను మీరు రాత్రివేళ డిన్నర్‌కు ఆహ్వానిస్తే... నీటిపై తేలే పెద్దపెద్ద కొవ్వొత్తులను వెలిగించి పెట్టండి. చూసేందుకవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.


దీనిపై మరింత చదవండి :