గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2025 (22:53 IST)

పుతిన్ కోసం 40 నిమిషాలు వేచి చూస్తూ గోళ్లు కొరుక్కున్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్

Shehbaz Sharif
రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ 40 నిమిషాల పాటు ఎదురుచూసాడు. అప్పటిదాకా కుర్చీలో కూర్చుని గోళ్లు కొరుక్కుంటూ వున్నాడు. ఇక అంతసేపు ఆగలేని పాక్ ప్రధాని లేచివెళ్లి నేరుగా గేట్ క్రాషింగ్ చేస్తూ.. అంటే ఆహ్వానం లేకుండానే పుతిన్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్ మరో నాయకుడు ఎర్డోగన్‌తో సమావేశంలో వున్నారు.
 
పాక్ ప్రధాని ఒక్కసారిగా చెప్పాపెట్టకుండా లోనికి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. షాబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పక్కనే కూర్చుని ఫోటో దిగేందుకు యత్నించినా అది కూడా సఫలం కాలేదు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను పుతిన్ విస్మరించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆగస్టు నెలలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి సమక్షంలో షాబాజ్ షరీఫ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయారు పుతిన్.
 
కాగా తాజాగా షాబాజ్ పడ్డ ఇబ్బంది తాలూకు ఘటనా క్రమం మొత్తం సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర స్పందనలకు దారితీసింది. చాలా మంది వినియోగదారులు పాకిస్తాన్ దౌత్య వైఫల్యాన్ని ఎగతాళి చేశారు. ఒక వినియోగదారుడు పుతిన్ బిచ్చగాళ్లపై సమయం వృధా చేయడు అని రాశారు, మరొకరు ట్రంప్ వారికి కూడా అదే పని చేశారని అన్నారు. ఈ కార్యక్రమం తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్‌లో ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ పీస్ అండ్ ట్రస్ట్‌లో భాగంగా జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ సహా అనేక దేశాల నుండి అగ్ర నాయకులు హాజరయ్యారు.