బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (12:43 IST)

మడగాస్కర్‌లో ప్లేగు వ్యాధి బారినపడి 40 మంది మృతి!

మడగాస్కర్‌లో ప్లేగు వ్యాధి బారినపడి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు నెలలో సిరోనోమానిడిడీ జిల్లాలో తొలిసారి వెలుగు చూసిన ఈ ప్లేగు వ్యాధి క్రమంగా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీంతో భారీ సంఖ్యలు ప్రజలు ప్రాణ నష్టం సభవించింది. 
 
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధికి ముందుగా చికిత్స చేసినట్లయితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని స్పష్టం చేసింది.
 
ప్రస్తుతం అక్కడ రెండు శాతంగా ఉన్న ప్లేగు వ్యాధి అత్యంత వేగంగా వ్యక్తి నుంచి మరో వ్యక్తి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపింది. ఈ వ్యాధి జనాభా అధికంగా వుండే నగరాలకు వ్యాపించినట్లైతే  ప్రాణం నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.