ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, బయట ఎక్కడ నలుగురు మాట్లాడుకున్నా పవన్‌కళ్యాన్ నటించిన 'గబ్బర్‌సింగ్' గురించే చర్చ నడుస్తుంది. ఇద్దరు దర్శకులు కలుసుకున్నా, నిర్మాతలు కలుసుకున్నా... ఇదే టాక్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సరేసరే... ఇప్పటికీ కొన్నిచోట్ల బ్లాక్‌లో టిక్కెట్లు కొంటున్నారని చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అంటున్నారు. ఈ చిత్రం ఇంత విజయం సాధిస్తుందని ఊహించలేదని.. అంటున్న ఆయన పవన్‌కళ్యాణ్‌తో పనిచేసిన అనుభవాలు, సినిమా సంగతులు ఈ విధంగా వెబ్‌దునియాకు ప్రత్యేకంగా తెలియజేశారు..నిర్మాతగా విజయం తర్వాత ఎలా అనిపించింది?ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో 'తీన్మార్' చేశాను. అది నాకు చాలా నచ్చిన చిత్రం. టెక్నికల్‌గా కొన్ని లోపాలున్నాయేమో తెలియదు కానీ.. ఆ సినిమాకు పడినంత కష్టం పవన్‌కళ్యాణ్ ఏ సినిమాకూ పడలేదు. చలిలో కూడా ముసుగు వేసుకుని అర్థరాత్రులు షూటింగ్ చేశారు. జయాపజయాలు దైవానదీనం. ఆ సినిమా సూపర్‌హిట్ అవుతుందనుకున్నా. కానీ.. నిరాశపర్చింది. సినిమా రిలీజ్ తర్వాత సినిమా పోయింది సార్ అని చెప్పాను. వెంటనే మరోమాట మాట్లాడకుండా... తర్వాత సినిమా నువ్వే చేయ్ అన్నారు.