మహిళలపై హింసలు, అత్యాచారాలు, దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పురుషునికి సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ మహిళలకు భద్రత కరువైంది. ఎక్కడ చూసిన అత్యాచారాలు, గృహ హింసలు, వేధింపులు అధికమైపోతున్నాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరిస్తోంది. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింస బాధితులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది.